| దీపికతో ప్రేమాయణం నిజమే | |
దీపికకు ముందుగా తాను బాలీవుడ్ నటి కిమ్ శర్మకు నాలుగేళ్లు పాటు దగ్గరగా ఉన్నట్టు చెప్పారు.డ్రస్సింగ్ సెన్స్, తీరిక సమయాల్లో విభిన్న వ్యక్తులను కలుసుకోవడాన్ని ఆమే తనకు నేర్పించిందన్నాడు. ప్రస్తుతం తాను ఒంటరికీ, సంతోషకర జీవితాన్ని గడుపుతున్నట్టు చెప్పాడు. తను అత్యధికంగా క్రికెట్‌ను ప్రేమిస్తానని...తన పెద్ద స్వప్నం కెప్టెన్సీగా చెప్పాడు. ఈ ఫీచర్లో బాలీవుడ్ నటి ప్రీతి జింటా యువరాజ్ సింగ్ గురించి మాట్లాడుతూ...ఏదో ఒక రోజు యూవీని భారత జట్టుకు కెప్టెన్‌గా చూడాలని ఉందని చెప్పారు. తనకు తెలిసినదాన్ని ఇతరులకు నేర్పేందుకు, ఇతరుల నుంచి నేర్చుకొనేందుకు యువరాజ్ సింగ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని చెప్పారు. | |
********************************************************************************
| రవితేజ చిత్రం "కిక్'! | |
| | |
| పోలీస్ ఆఫసర్‌గా ఎన్టీఆర్? | |
దివంగత ఎన్టీఆర్ "కొండవీటి సింహం', బాలకృష్ణ "రౌడీ ఇనిస్పెక్టర్', నందమూరి హరికృష్ణ "సీతయ్య'లో పోలీస్ ఆఫీసర్ల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. యువ కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ 'హరేరామ్'(ఈ రోజు విడుదల) చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించాడు. ఇప్పుడు పోలీస్ ఆఫసర్ పాత్రలో ఎన్టీఆర్ సైతం తన సత్తాను నిరూపించుకొనేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. "ఆది', "సాంబ' చిత్రాల తర్వాత ఇది వారిద్దరి కాంబినేషన్లో మూడో చిత్రం.వంశీ, కొడాలి నాని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీత బాణీలు సమకూర్చనున్నారు. త్రిష, తమన్న ఎన్టీఆర్ సరసన నటించనున్నట్టు టాలీవుడ్లో వినికిడి. | |
| సిక్స్ ప్యాక్‌లో అలీ! | |
విశాల్, నయనతార హీరోగా రూపుదిద్దుకొంటున్న తెలుగు, తమిళ బైలింగ్వల్ చిత్రం 'సెల్యూట్'. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో విశాల్ సిక్స్ ప్యాక్ బాడీలో దర్శనమివ్వనుండడం తెలిసిందే. ఈ సిక్స్ ప్యాక్ బాడీకి సంబంధించిన మీడియాలో విడుదలైన ఫోటోలకు విశేష ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న హాస్య నటుడు అలీ సైతం సిక్స్ ప్యాక్ బాడీతో ఓ పాటలో నయనతారతో కలిసి కనిపించనున్నాడు. ఈ సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించనున్నాడట. మరెందుకు ఆలస్యం...పక్క పేజీకి వెళ్తే అలీ సిక్స్ ప్యాక్ బాడీని చూడవచ్చు. | |
| |
| కుమార్తెతో జ్యోతిక | |
సూర్య-జ్యోతికల ముద్దుల కుమార్తె ఫోటోలు తొలిసారిగా సినీ అభిమానులకు అందుబాటులోకి వచ్చాయి. జ్యోతిక తన కుమార్తె దియాతో కలిసి మీడియా కెమెరా కంటికి కనిపించడం ఒదే తొలిసారి. ఈ ఫోటోలను ఇక్కడ చూడండి. | |
| ముద్దుకు ప్రియాంక | |
సిల్వర్ స్క్రీన్‌పై ఇక ఏ హీరోకూ ముద్దు పెట్టకూడదని బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా విధాన నిర్ణయం తీసుకొందట. ఆఖరుకు "లవ్ స్టోరీ 2050' చిత్రంలో తన భాయ్‌ఫ్రెండ్, యువ కథానాయకుడు హర్మన్ భవేజాను ముద్దాడేందుకు సైతం ప్రియాంక అంగీకరించలేదని బాలీవుడ్లో వినికిడి. సహచర నటుడు ఎవరైనా...సినిమా విషయానికొస్తే కొన్ని నిబంధనలను తప్పకుండా పాటించాలని నిర్ణయించుకొన్నట్టు ఆమె చెబుతోంది. సినిమాలోని ఒరిజినల్ స్క్రిఫ్ట్ మేరకు తనకు ముద్దు పెట్టేందుకు ప్రియాంక అంగీకరించలేదని హర్మన్ భవేజా సైతం ధృవీకరించాడు. తన చేతిలో ప్రియాంక గాంధి చనిపోయే సందర్భంలో తాను ఆమెకు ముద్దు పెట్టాల్సి ఉందని...అయితే దీనికి ఆమె అంగీకరించలేదని చెప్పాడు. అయితే ఆమె నిర్ణయాన్ని గౌరవించి తాము సైతం ముద్దు కోసం ఒత్తిడి తీసుకరాలేదని చెప్పాడు. తనకు భాయ్‌ఫ్రెండ్ కూడా అయిన హర్మాన్‌కు ముద్దు పెట్టేందుకు ప్రియాంక ఎందుకు అంగీకరించలేదన్న అంశంపై బాలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో ముద్దు పెడితే మరో నిర్మాత తమ చిత్రంలో కూడా హీరోకు ముద్దు పెట్టాలని ఒత్తిడి తెస్తాడు. అంగీకరించకపోతే వృత్తి ధర్మాన్ని పాటించకుండా వివక్ష చూపుతున్నానని విమర్శిస్తారు. అందుకే ముందు చూపుగా హర్మాన్‌తో ముద్దు సీన్లో నటించేందుకు ఆమె ఒప్పుకోలేదట. తమ తొలి చిత్రం "ఆందాజ్'లో హర్మాన్, ప్రియాంకలు ముద్దు సీన్లో నటించినా...ఇకపై ఏ చిత్రంలోనూ ముద్దు సీన్లలో నటించకూడదన్నది ప్రియాంక విధాన నిర్ణయమట. | |
| షరాన్‌కు ముమైత్ అనుకరణ | |
| శిల్పా శెట్టి కొత్త అవతారం | |
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సినీ నిర్మాతగా కొత్త అవతారమెత్తనుంది. "ఎస్2 గ్లోబల్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై ఆమె తన చిత్రాలను నిర్మించనున్నారు. తన బ్యానర్ కింద ఏడాదికి రెండు చిత్రాలను నిర్మించాలని శిల్పా శెట్టి నిర్ణయించింది. తొలి చిత్రం యాక్షన్ కామెడీగా ఉంటుందని...దీనికి మనీష్ ఝా దర్శకత్వంవహిస్తారని శిల్పా శెట్టి తెలిపింది. సినీ నటిగా తగిన ఆఫర్లు లేకపోవడంతో ఆమె సినీ నిర్మాణ రంగంపై మొగ్గుచూపుతున్నట్టు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే విమర్శలను శిల్పా శెట్టి తోసిపుచ్చింది. | |
| Sify Home >> News & Info >> Telugu Home >> Videos >> Fullstory |
| |
| శ్రీనువైట్ల(రెడీ) | |||||||||
| |||||||||