Sunday, July 20, 2008

దీపికతో ప్రేమాయణం నిజమే



Yuvraj-deepika ముంబయి: బాలీవుడ్ నటి దీపిక పడుకొనెతో భారత క్రికెటర్ల యువరాజ్ సింగ్ ప్రేమాయణానికి సంబంధించి ట్వంటీ20 వరల్డ్ కప్ సందర్భంలో పలు కథనాలు వినిపించాయి. తాజాగా 'పీపుల్స్' మెగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీన్ని స్వయంగా యువరాజ్ సింగ్ ధృవీకరించాడు. కొంత కాలం పాటు తమ ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగిందని చెప్పాడు. అయితే ఆ తర్వాత దీపిక వ్యక్తిగత కారణాలతో మరో వ్యక్తి వెంట వెళ్లిపోయిందని చెప్పాడు.

దీపికకు ముందుగా తాను బాలీవుడ్ నటి కిమ్ శర్మకు నాలుగేళ్లు పాటు దగ్గరగా ఉన్నట్టు చెప్పారు.డ్రస్సింగ్ సెన్స్, తీరిక సమయాల్లో విభిన్న వ్యక్తులను కలుసుకోవడాన్ని ఆమే తనకు నేర్పించిందన్నాడు.

ప్రస్తుతం తాను ఒంటరికీ, సంతోషకర జీవితాన్ని గడుపుతున్నట్టు చెప్పాడు. తను అత్యధికంగా క్రికెట్‌ను ప్రేమిస్తానని...తన పెద్ద స్వప్నం కెప్టెన్సీగా చెప్పాడు.

ఈ ఫీచర్‌లో బాలీవుడ్ నటి ప్రీతి జింటా యువరాజ్ సింగ్ గురించి మాట్లాడుతూ...ఏదో ఒక రోజు యూవీని భారత జట్టుకు కెప్టెన్‌గా చూడాలని ఉందని చెప్పారు. తనకు తెలిసినదాన్ని ఇతరులకు నేర్పేందుకు, ఇతరుల నుంచి నేర్చుకొనేందుకు యువరాజ్ సింగ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని చెప్పారు.




********************************************************************************
రవితేజ చిత్రం "కిక్'!



రవితేజ, సురేందర్‌ల కాంబినేషన్‌లో త్వరలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి 'కిక్' అనే ఆకర్షణీయమైన మాస్ టైటిల్‌ను నిర్ణయించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినికిడి. ఈ టైటిల్‌ను ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో రిజిస్టర్డ్ చేయించుకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న "నేనింతే' చిత్రంతో బిజీగా ఉన్నారు. రవితేజ, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించిన "బలాదూర్' చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పోలీస్ ఆఫసర్‌గా ఎన్టీఆర్?



NTR-Vinayak ఎన్టీఆర్, వీవీ వినాయక్ కాంబినేషన్లో మూడో చిత్రం రూపుదిద్దుకోనుండడం తెలిసిందే. ఏప్రిల్ నెలలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. అయితే ఇంకా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియడం లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫసర్ పాత్రను పోషించనున్నారట. ఎన్టీఆర్ పోలీస్ ఆఫసర్‌గా నటించడం ఇదే తొలిసారి.

దివంగత ఎన్టీఆర్ "కొండవీటి సింహం', బాలకృష్ణ "రౌడీ ఇనిస్పెక్టర్', నందమూరి హరికృష్ణ "సీతయ్య'లో పోలీస్ ఆఫీసర్ల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. యువ కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ 'హరేరామ్'(ఈ రోజు విడుదల) చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించాడు. ఇప్పుడు పోలీస్ ఆఫసర్ పాత్రలో ఎన్టీఆర్ సైతం తన సత్తాను నిరూపించుకొనేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.

"ఆది', "సాంబ' చిత్రాల తర్వాత ఇది వారిద్దరి కాంబినేషన్‌లో మూడో చిత్రం.వంశీ, కొడాలి నాని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీత బాణీలు సమకూర్చనున్నారు. త్రిష, తమన్న ఎన్టీఆర్ సరసన నటించనున్నట్టు టాలీవుడ్‌లో వినికిడి.
####################################
సిక్స్ ప్యాక్‌లో అలీ!



Ali

విశాల్, నయనతార హీరోగా రూపుదిద్దుకొంటున్న తెలుగు, తమిళ బైలింగ్వల్ చిత్రం 'సెల్యూట్'. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో విశాల్ సిక్స్ ప్యాక్ బాడీలో దర్శనమివ్వనుండడం తెలిసిందే. ఈ సిక్స్ ప్యాక్ బాడీకి సంబంధించిన మీడియాలో విడుదలైన ఫోటోలకు విశేష ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న హాస్య నటుడు అలీ సైతం సిక్స్ ప్యాక్ బాడీతో ఓ పాటలో నయనతారతో కలిసి కనిపించనున్నాడు. ఈ సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించనున్నాడట. మరెందుకు ఆలస్యం...పక్క పేజీకి వెళ్తే అలీ సిక్స్ ప్యాక్ బాడీని చూడవచ్చు.

@@@@@@@@@@@@@

హైదరాబాద్: మళ్లీ క్రీయాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు రంగం సిద్ధం చేసుకొంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తన కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని షిర్డి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మళ్లీ రాజకీయాల్లోకి రావాలని మోహన్ బాబు నిర్ణయించుకొన్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో తన ఇష్టదైవమైన షిర్డిసాయిబాబాను మోహన్ బాబు దర్శించుకోవడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఆయన కుటుంబీకులు మాత్రం గురిపూర్ణిమ సందర్భంగానే ఆలయంలో పూజలు నిర్వహించినట్టు చెబుతున్నారు.
****************************************************************************
కుమార్తెతో జ్యోతిక



Jyothika

సూర్య-జ్యోతికల ముద్దుల కుమార్తె ఫోటోలు తొలిసారిగా సినీ అభిమానులకు అందుబాటులోకి వచ్చాయి. జ్యోతిక తన కుమార్తె దియాతో కలిసి మీడియా కెమెరా కంటికి కనిపించడం ఒదే తొలిసారి. ఈ ఫోటోలను ఇక్కడ చూడండి.



****************************************************************************
ముద్దుకు ప్రియాంక



Priyanka Chopra

సిల్వర్ స్క్రీన్‌పై ఇక ఏ హీరోకూ ముద్దు పెట్టకూడదని బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా విధాన నిర్ణయం తీసుకొందట. ఆఖరుకు "లవ్ స్టోరీ 2050' చిత్రంలో తన భాయ్‌ఫ్రెండ్, యువ కథానాయకుడు హర్మన్ భవేజాను ముద్దాడేందుకు సైతం ప్రియాంక అంగీకరించలేదని బాలీవుడ్‌లో వినికిడి. సహచర నటుడు ఎవరైనా...సినిమా విషయానికొస్తే కొన్ని నిబంధనలను తప్పకుండా పాటించాలని నిర్ణయించుకొన్నట్టు ఆమె చెబుతోంది.

సినిమాలోని ఒరిజినల్ స్క్రిఫ్ట్ మేరకు తనకు ముద్దు పెట్టేందుకు ప్రియాంక అంగీకరించలేదని హర్మన్ భవేజా సైతం ధృవీకరించాడు. తన చేతిలో ప్రియాంక గాంధి చనిపోయే సందర్భంలో తాను ఆమెకు ముద్దు పెట్టాల్సి ఉందని...అయితే దీనికి ఆమె అంగీకరించలేదని చెప్పాడు. అయితే ఆమె నిర్ణయాన్ని గౌరవించి తాము సైతం ముద్దు కోసం ఒత్తిడి తీసుకరాలేదని చెప్పాడు.

తనకు భాయ్‌ఫ్రెండ్ కూడా అయిన హర్మాన్‌కు ముద్దు పెట్టేందుకు ప్రియాంక ఎందుకు అంగీకరించలేదన్న అంశంపై బాలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో ముద్దు పెడితే మరో నిర్మాత తమ చిత్రంలో కూడా హీరోకు ముద్దు పెట్టాలని ఒత్తిడి తెస్తాడు. అంగీకరించకపోతే వృత్తి ధర్మాన్ని పాటించకుండా వివక్ష చూపుతున్నానని విమర్శిస్తారు. అందుకే ముందు చూపుగా హర్మాన్‌తో ముద్దు సీన్‌లో నటించేందుకు ఆమె ఒప్పుకోలేదట. తమ తొలి చిత్రం "ఆందాజ్'లో హర్మాన్, ప్రియాంకలు ముద్దు సీన్‌లో నటించినా...ఇకపై ఏ చిత్రంలోనూ ముద్దు సీన్లలో నటించకూడదన్నది ప్రియాంక విధాన నిర్ణయమట.

**********************************************************************
షరాన్‌కు ముమైత్ అనుకరణ



Mumaith Khan టాలీవుడ్ శృంగార తార ముమైత్ ఖాన్ తన తదుపరి చిత్రం "టార్గెట్'లో హాలీవుడ్ అలనాటి హాట్ నటి షరాన్ స్టోన్‌ను అనుకరించనుంది. 'బేసిక్ ఇన్‌స్టింక్ట్' చిత్రంలోని కేథరిన్ ట్రామెల్లా పాత్రలో షరాన్ స్టోన్‌లా ముమైత్ ఖాన్ దర్శనమివ్వనుంది. "టార్గెట్' చిత్రం కూడా "బేసిక్ ఇన్‌స్టంక్ట్' తరహాలోనే మర్డర్ మిస్టరీతో రూపుదిద్దుకొంటున్నట్టు సమాచారం.



**************************************************************************
శిల్పా శెట్టి కొత్త అవతారం



Shilpa Shetty

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సినీ నిర్మాతగా కొత్త అవతారమెత్తనుంది. "ఎస్2 గ్లోబల్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై ఆమె తన చిత్రాలను నిర్మించనున్నారు. తన బ్యానర్ కింద ఏడాదికి రెండు చిత్రాలను నిర్మించాలని శిల్పా శెట్టి నిర్ణయించింది. తొలి చిత్రం యాక్షన్ కామెడీగా ఉంటుందని...దీనికి మనీష్ ఝా దర్శకత్వంవహిస్తారని శిల్పా శెట్టి తెలిపింది.

సినీ నటిగా తగిన ఆఫర్లు లేకపోవడంతో ఆమె సినీ నిర్మాణ రంగంపై మొగ్గుచూపుతున్నట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే విమర్శలను శిల్పా శెట్టి తోసిపుచ్చింది.

*************************************************************************************
Sify Home >> News & Info >> Telugu Home >> Videos >> Fullstory




శ్రీనువైట్ల(రెడీ)







"రెడీ' చిత్రం హిట్ గురించి శ్రీనువైట్ల


***********************************************************************

No comments: